YSRCP MLA Sudhakar: కరోనా భారీన మరో వైసీపీ ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, ఐసోలేషన్ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 ( COVID-19) భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో మరో ఇద్దరు కరోనావైరస్ (Coronavirus) భారీన పడ్డారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కే శ్రీనివాసరావు (YCP S.Kota MLA Kadubandi Srinivasa Rao) ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.
Amaravati, June 26: కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 ( COVID-19) భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో మరో ఇద్దరు కరోనావైరస్ (Coronavirus) భారీన పడ్డారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కే శ్రీనివాసరావు (YCP S.Kota MLA Kadubandi Srinivasa Rao) ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ
కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు (YSRCP MLA Sudhakar) గురువారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నారు. కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు ఎమ్మెల్యేను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు కరోనా రావడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు, పలువురికి కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.
లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఆయన తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ (kodumur mla sudhakar) గన్‌మెన్‌ను కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. కాగా తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు
ఇదిలా ఉంటే వైసీపీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలోనూ ఒకరికి కరోనా వైరస్ సోకింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడికి కరోనా వైరస్ సోకినట్లు జిల్లా అధికారులు నిర్ధారించారు. ఫలితంగా- అన్నా రాంబాబు సహా, ఆయన కుటుంబ సభ్యులు ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నారు. రాంబాబు కారు డ్రైవర్, అటెండర్‌కు నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.