AP Budget Session 2023-24: ప్లకార్డుతో సభలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన, నమ్మకద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని అంబటి రాంబాబు మండిపాటు, కొనసాగుతున్న రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు

సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజక సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిలబడ్డారు.

Andhra pradesh Assembly Session (photo-PTI)

Amaravati, Mar 15: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Budget Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజక సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిలబడ్డారు.

దీంతో క్వశ్చన్ అవర్‌లో మెంబర్ మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. ‘‘శ్రీధర్ రెడ్డి మీరు ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకోవాలంటే నేను గవర్నమెంట్‌కు తెలియజేస్తాను. మీరు చేస్తున్న ప్రొటెస్ట్‌ను హౌస్, నేను కూడా గుర్తించాం. మీరు కంటిన్యూగా ఇలా చేయడం తగదు. మీరు కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుంది’’ అని స్పీకర్ తమ్మినేని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, అసెంబ్లీలో గవర్నర్ నజీర్ తొలి ప్రసంగం, ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి (Buggan Rajendranath Reddy) స్పందిస్తూ... సమస్యలు లేని సోసైటీ ఉండదని.. సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలన్నారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని తెలిపారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామన్నారు.వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తామంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు.

మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులకు తెల్లారే సరికి శ్రీధర్ రెడ్డిపై ప్రేమ వచ్చేసిందే అంటూ యెద్దేవా చేశారు. శ్రీధర్ రెడ్డి ఇక్కడకు వచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని... శ్రీధర్ రెడ్డిని క్షమించొద్ద అని, అవకాశం ఇవ్వద్దు అవసరం అయితే చర్యలు తీసుకోండి’’ అంటూ స్పీకర్‌కు మంత్రి అంబటి వినతి చేశారు.నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు.

సీఎం జగన్‌ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారు: మంత్రి బొత్స

చంద్రబాబు హయాంలో 5వేల స్కూళ్లను మూసేశారని, సీఎం జగన్‌ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదు.. ఏ ఊరులో స్కూలు మూతపడిందో చెప్పాలి’’ అంటూ మంత్రి బొత్స సవాల్‌ విసిరారు.

సీఎం జగన్‌ పాలనలో సమృద్ధిగా వర్షాలు: అబ్బయ్య చౌదరి

సీఎం జగన్‌ పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. ‘‘రైతుల కోసం సీఎం జగన్‌ ఎన్నో చేశారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు.. సీఎం జగన్ వ్యవసాయం పండగ అంటున్నారు’’ అని అబ్బయ్య చౌదరి అన్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు