AP governor Abdul Nazeer (Photo-Video Grab)

Amaravati, Mar 14: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఇది చాలా సెమినల్ ఇష్యూ అంటూ రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ

నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్‌ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు.

హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం, తెలుగు రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్, వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన

కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామన్నారు. 11.43 శాతం గ్రోత్‌ రేటును సాధించాం.ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది.మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు.

గవర్నర్ నజీర్ ప్రసంగం హైలెట్స్

వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్‌ కార్డులు

♦పీహెచ్‌సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు

♦వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు

♦ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్‌ పింఛన్‌ కానుక

♦వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ

♦2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు

♦మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

♦నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం

♦81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ

♦జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు

♦వైఎస్సార్‌ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశాం

♦విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్‌ లెర్నింగ్‌

♦విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ

♦జగనన్న విద్యా​కానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు

♦2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు

♦1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్‌

♦జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి

♦జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు

♦ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు

♦కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశాం

♦కడపలో డా.వైఎస్సార్‌ ఆర్కిటైక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్ వర్శిటీ

♦అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం

♦44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం

స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్‌ ఆమోదించనుంది. కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక

ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.