AP Budget Session 2022: రెండో రొజు అసెంబ్లీ సమావేశాలు, గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌, ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన పలువురు నేతలు

ఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గౌతమ్‌రెడ్డి సంతాపం తీర్మానంను సభలో (AP Assembly Budget Sessions 2022) ప్రవేశపెట్టారు. గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy No More) లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది (CM YS Jagan) తెలిపారు.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravati, Mar 8: ఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గౌతమ్‌రెడ్డి సంతాపం తీర్మానంను సభలో (AP Assembly Budget Sessions 2022) ప్రవేశపెట్టారు. గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy No More) లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది (CM YS Jagan) తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు.

దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy). ఎలాంటి ఇగో లేని వ్యక్తి. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన మరణ వార్త వినగానే షాక్‌కు గురయ్యాం.. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. 2010 నుంచి సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి అనిల్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రసంగించారు మంత్రి అనిల్‌.

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌, మార్చి 27 నుంచి కడప నుంచి అదనంగా మూడు విమాన సర్వీసులు, మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం

ఎన్ని బాధ్యతలు నిర్వహించినా.. వివాదాలు లేకుండా సమర్థవంతుడిగా పేరుంది గౌతమ్‌ రెడ్డికి. ఆయన లేని లోటు తీరనిది అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. గౌతమ్‌.. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి అని పెద్దిరెడ్డి రాం చంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి. అజాతశత్రువు ఆయన. ప్రతిపక్షాల మెప్పు సైతం పొందిన వ్యక్తి. జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్‌రెడ్డి అని ఆమె అన్నారు.

గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ పాలసీ, ఏపీ ఐటీ పాలసీలు చేస్తున్నప్పుడు ‘గౌతమ్‌రెడ్డి అన్న’తో అనేకసార్లు చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి రాజకీయల్లో​ ఉన్నతమైన పదవులు సాధించినా ఎప్పుడూ గొప్ప సంస్కారంతో ఉండేవారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి మరో మూడు దశాబ్దాలు ప్రజా జీవితానికి పనికివస్తాడని తాను భావించేవాడినని గుర్తుచేసుకున్నారు.

ఈ నెల 25 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభకు ఈ నెల 11న రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌, బీఏసీ సమావేశంలో టీడీపీపై మండిపడిన ఏపీ సీఎం వైఎస్ జగన్

గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి గొప్ప విద్యావంతుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయుడని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లా పర్యటనపై గౌతమ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని గుర్తుచేశారు.

సంతాప తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. 9వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 10వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now