AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

AP Assembly (Photo-X)

Vijayawada, July 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ  కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. శాసన సభలో చర్చించాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలానే అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు శ్వేత పత్రాలను సభ ముందు ఉంచాలని చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఇప్పటికే నిర్ణయించడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను సభ ముందు ఉంచనుంది.

ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు! 

అటు వైసీపీ నిరసన పిలుపు

వైసీపీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఇదే విషయమై ఢిల్లీలో బుధవారం కూడా నిరసన తెలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఢిల్లీకి రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం.

వజ్రాల హారాన్ని పొరపాటున చెత్తకుండీలో పడేసిన ఓనర్.. తెలియక ఆ చెత్తను తీసుకెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది.. ఆ తర్వాత ఏమైంది?? చెన్నైలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif