AP Budget 2023: స్పీకర్ రూలింగ్‌కు వ్యతిరేకంగా రెడ్ లైన్ క్రాస్, 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, 9వ రోజు కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్‌ చేశారు. స్పీకర్‌ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు

TDP MLAs Suspended (photo-Video Grab)

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్‌ చేశారు. స్పీకర్‌ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ ఛైర్‌ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు.

సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాగే కొనసాగింది. సభ ప్రారంభం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చ కు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. జీవో నెంబర్ 1 పై వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. స్పీకర్ రూలింగ్ కు వ్యతిరేకంగా రెడ్ లైన్ దాటి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో ఆటోమేటిక్ సస్పెన్షన్ వర్తించిందని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రెడ్ లైన్ దాటవద్దని స్పీకర్ హెచ్చరించినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ

అయినా పోడియం ఎక్కిన టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇవాళ వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి, నిమ్మకాయల, ఏలూరి సాంబశివరావు, చినరాజప్ప, డోల స్వామి, మంతెన రామరాజులను సభనుంచి సస్పెండ్ చేశారు.

టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్‌దన్నారు.