AP Budget 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, అసెంబ్లీలో కనిపించని ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ శిబిరంలో బలపడుతున్న అనుమానాలు

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)లు శాసనసభలో కనిపించలేదు.

Andhra Pradesh Assembly (photo-PTI)

Amaravati, Mar 24: తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)లు శాసనసభలో కనిపించలేదు.

కాగా వీళ్లద్ధరూ క్రాస్ ఓటింగ్‍కు (cross Voting in MLC Elections) పాల్పడ్డారని విస్తృత ప్రచారం జరుగుతోంది. తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బెంగళూరుకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అనంతరం ఆయన్ని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి.

స్పీకర్ రూలింగ్‌కు వ్యతిరేకంగా రెడ్ లైన్ క్రాస్, 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, 9వ రోజు కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

అటు సోషల్ మీడియాలో (Social Media).. ఇటు మీడియాలో ఈ విషయం రచ్చకెక్కడంతో తనపై వచ్చిన ఆరోపణలకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు. ‘నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్‌ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. జగన్ గారి నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ

క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయి. మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాం. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. దళిత మహిళను కాబట్టే ఇలా చులకనగా చూస్తున్నారు. నేను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని పెట్టినప్పుడే రాజీనామా చేయాలి. నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చండి. మళ్లీ చెబుతున్నాను.. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో నా పేరును దయచేసి లాగొద్దు’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలు శ్రీదేవి వివరణ ఇచ్చుకోగా ఇంతవరకూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించ లేదు. పైగా వైసీపీ పెద్దల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదని సమాచారం. కొన్నిసార్లు ఫోన్ స్విచాఫ్ అని కూడా వస్తోందట. కనీసం రిటర్న్ కాల్ కూడా రాకోవడంతో అధిష్ఠానం అనుమానమే నిజమేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని అధిష్ఠానం నియమించడంతో మేకపాటి చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీకి ఓటు వేసి ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఆయన మీడియా ముందుకు రావాల్సిందే.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now