Bulk Drug Park in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ, కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగింత

తాజాగా జగన్ సర్కారు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు (Bulk Drug Parks in AP) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి (APIIC) అప్పగించింది. అదే విధంగా ప్రైవేట్ పార్టనర్‌ని గుర్తించే బాధ్యతను అప్పగించడం సహా ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్‌ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

IPS Officers Transfers And Promotions In Andhra Pradesh (photo-Twitter)

Amaravati, August 26: పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కారు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు (Bulk Drug Park in AP) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి (APIIC) అప్పగించింది. అదే విధంగా ప్రైవేట్ పార్టనర్‌ని గుర్తించే బాధ్యతను అప్పగించడం సహా ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్‌ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ (bulk-drug parks) ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం ఇటీవలే ఇందుకు ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలో ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీబీడీఐసీ) ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు కానున్న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా. దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో సదరు పార్క్‌ ఏర్పాటు ద్వారా సుమారు రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేబినెట్‌ అంచనాకు వచ్చింది. ఏపీఐఐసీకి అనుబంధంగా డ్రగ్‌ కార్పొరేషన్‌ తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో ఏర్పాటు కానుంది. అయితే జిల్లాలో ఉన్న పారిశ్రామిక వాడల్లో ఎక్కడ ఈ పార్క్‌ ఏర్పాటుకు అనుకూలమో త్వరలో నిర్ణయించనుంది. ఆడపిల్లల రక్షణ కోసం ఎనిమిది స్పెషల్‌ కోర్టులు, కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు, దిశ తరహాలో అవినీతి నిర్మూలనకు కొత్త బిల్లు

విశ్వస నీయ వర్గాల సమాచారం మేరకు పెద్దాపురం పారిశ్రామికవాడలో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే ఈ భేటీలో రాష్ట్ర పరిధిలో ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం 2006 ను సవరించి కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ఈ చట్టంలో పలు మార్పులు జరగనున్నాయి. పనులు రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

దీంతో ఆక్వాకల్చర్‌లో నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లా తర్వాత ఇక్కడే అధికంగా ఈ కల్చర్‌ సాగులో ఉండడంతో దీనిపై ఆధారపడిన రైతు లకు త్వరలో నాణ్యమైన విత్తనం లభిస్తుంది. రొయ్య పిల్లల ఉత్పత్తిలో యాంటీబయోటిక్స్‌ వాడకుండా ప్రొ బయాటిక్స్‌ ద్వారా నాణ్యమైన విత్తనాన్ని అభివృద్ధి చేయాలనేది తాజాగా సవరించిన చట్టంలో పొందుపరచడంతో మన హేచరీల్లో త్వరలో అమల్లోకి రానుంది.