Amaravati, August 26: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు ( AP Govt) మహిళల రక్షణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (POSCO) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు (Special Courts in AP) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.
శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప , అనంతపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు పనిచేయనున్నాయి. కాగా మహిళ రక్షణ కొరకు ఏపీ సర్కార్ ఇదివరకే దిశ చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. పనులు రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
దీంతో పాటు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం నిర్ణయించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా కొత్త బిల్లు తీసుకురానున్నారు. ‘దిశ’ తరహాలో బిల్లు తేవాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు చేయాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేస్తారు. ఎమ్మార్వో, ఎండీఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కరోనా చికిత్సకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు, ఆస్పత్రులు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని కోరిన ఏపీ సీఎం జగన్
అలాగే ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ కు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయాల్లో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా స్పష్టం అయ్యిందని జగన్ కామెంట్ చేశారు.