AP Cabinet Key Decisions: కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం, ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం, ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో
ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
Vjy, Nov 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టున్నారు.
ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించిన కేబినెట్ అందుకు ఆమోద ముద్ర వేసింది. కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో జ.గనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు.
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
►ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
►కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
► జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు
►జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
► ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
►అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందన్న సీఎం జగన్
►మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలి: సీఎం జగన్
►నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం.
►6, 790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధన.
►క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.
►ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు.
►దీంతో ప్రభుత్వంపై రూ. 766 కోట్ల భారం.
►50 వేల మంది కార్మికులు ఆధారపడినందుకు నిర్ణయం తీసుకున్నాం.