AP Capital Bill Row: రాజ్‌భవన్‌కు చేరిన మూడు రాజధానుల బిల్లు, ఆమోదించవద్దని గవర్నర్‌కు చంద్రబాబు లేఖ, నిబంధనల ప్రకారమే గవర్నర్ చెంతకు చేరాయన్న వ్యవసాయమంత్రి కన్నబాబు
అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ వద్దకు రాజధాని బిల్లు చేరుకుంది. దీనిపై విశ్వభూషణ్ హరిచందన్ (Andhra Pradesh Governor Biswabhusan Harichandan) ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించుకునేందుకు ఈ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపింది.
Amaravati, Jul 23: ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లు ఈ అంశాలపై గత కొద్ది రోజులుగా చర్చ కొనసాగుతోంది. అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ వద్దకు రాజధాని బిల్లు చేరుకుంది. దీనిపై విశ్వభూషణ్ హరిచందన్ (Andhra Pradesh Governor Biswabhusan Harichandan) ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించుకునేందుకు ఈ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపింది. ఏపీ అసెంబ్లీలో అన్ని బిల్లులు మూజువాణి ఓటుతో పాస్, 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం, సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లుకు ఆమోదం
ఈ బిల్లు మీద న్యాయపరంగా ఉన్న చిక్కులన్నీ తొలగినట్లుగా సమాచారం. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత అధికారులు పరిపాలన వికేంద్రీకరణ (AP Capital Bill), సీఆర్డీయే బిల్లులను (Capital Region Development Authority (CRDA) ప్రభుత్వం తరఫున గవర్నర్‌కు పంపించారు. అయితే వాటిని పరిశీలించిన అనంతరం గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
గత నెల 17ర శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధిక వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున ఎటువంటి చర్చ, ఆమోదాలు లేకుండా నెల రోజులకు ఆటోమేటిక్ ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. నెల రోజుల గడువు 17తో ముగిసిపోయింది. జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు
కాగా గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి ఛైర్మెన్ సెలక్ట్ కమిటీకి పంపారు. ఇదిలా ఉంటే నిబంధనల ప్రకారమే అసెంబ్లీ అధికారులు సీఆర్‌డీఎ చట్టం రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ కి పంపారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలుకు మార్చాలని, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సిపి) ప్రభుత్వం కోరుతోంది. కాగా ఈ చర్య రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన అమరావతి రైతుల నుండి నిరసనకు దారితీసింది. టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి, రూల్ 154 కింద సెలక్ట్ కమిటీ వేయడం చెల్లదన్న శాసనమండలి కార్యాలయం
ఇదిలావుండగా, టిడిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు గవర్నర్‌ను "చట్టవిరుద్ధమైన బిల్లులపై ప్రజా అనుకూల నిర్ణయం" తీసుకోవాలని కోరారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రయోజనాలను, భవిష్యత్తు ఆకాంక్షలను పరిశీలించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి సూచించిందని గవర్నర్‌ను గుర్తుచేస్తూ, హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటిషన్లను విచారించే ప్రక్రియలో ఉన్నందున ఈ సమయంలో రెండు బిల్లుల ఆమోదం కోర్టును ధిక్కరించడానికి కారణమని ఆయన వాదించారు. పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం, కేంద్రం చెంతకు రద్దు తీర్మానం
అమరావతికోసం ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. అంతేకాకుండా 2006 అమరావతికి దలైలామా వచ్చారని.. అమరావతి అనేది ఒక సెంటిమెంట్ అన్నారు. ఎట్టి పరిస్థితులలోను బిల్లులను ఆమోదించవద్దని చంద్రబాబు లేఖలో గవర్నర్ ను కోరారు. కాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్ కు లేఖ రాశారు. అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్
మూడు రాజధానుల బిల్లులను ఎట్టి పరిస్థితులలో ఆమోదించవద్దని లేఖలో పేర్కొన్నారు. అయితే కన్నా లేఖ పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నా రాసిన లేఖ అచ్చం టీడీపీ నేతలు రాసినట్టుగానే ఉందని.. కన్నా రాసిన లేఖతో తమకెలాంటి సంబంధం లేదనే విధంగా కొందరు బీజేపీ నేతలు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీధిరౌడీలను ఏరివేస్తే గానీ వ్యవస్థ మారదు. -సీఎం జగన్
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు కన్న లక్ష్మి నారాయణ గవర్నర్‌కు లేఖ రాశారు, ఈ రెండు బిల్లులకు అనుమతి ఇవ్వవద్దని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఒకే రాజధానిని మాత్రమే ఇస్తుందని బిజెపి నాయకుడు తన లేఖలో పేర్కొన్నారు.