AP Panchayat Polls 2021: ఏపీ పంచాయితీ ఎన్నికలకు స్పెషల్ పోలీసాఫీసర్, బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.సంజయ్, ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ భేటీ, ఎన్నికల విధుల్లో పాల్గొంటామని తెలిపిన ఉద్యోగ సంఘాలు

ఏపీలో పంచాయితీ వేడి రాజుకుంది. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ (AP Panchayat Polls 2021) ఇవ్వడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మరోసారి సమరం సాగుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలన్నీ నామినేషన్ల పర్వంలో మునిగిపోయాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఏకగ్రీవమయ్యే పంచాయితీలకు రూ. 20 లక్షల ప్రోత్సాహకం కూడా ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉద్యోగ సంఘాలతో భేటి అయ్యారు.

Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Amaravati, Jan 27: ఏపీలో పంచాయితీ వేడి రాజుకుంది. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ (AP Panchayat Polls 2021) ఇవ్వడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మరోసారి సమరం సాగుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పార్టీలన్నీ నామినేషన్ల పర్వంలో మునిగిపోయాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఏకగ్రీవమయ్యే పంచాయితీలకు రూ. 20 లక్షల ప్రోత్సాహకం కూడా ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉద్యోగ సంఘాలతో భేటి అయ్యారు.

ఈ భేటీలో ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఎన్నికల విధుల్లో (AP Panchayat Elections 2021) పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కోరారు. కోడ్‌ అమలు, ఉద్యోగుల విధుల గురించి చెప్పిన ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి కూడా వారికి వివరించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ఒకేసారి నిర్వహించడం కష్టమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో బుధవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తానని హమీ ఇచ్చారు. ఇక తమ భద్రతకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు పలు అనుమానాలు లేవనెత్తగా ఆయన నివృత్తి చేశారు. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. సమావేశానంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.

గ్రామాలకు బంపరాఫర్ ఇచ్చిన ఏపీ సర్కారు, ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకం, విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని.. కానీ, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను (AP CS Adityanath Das) కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతిచెందితే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరామన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్‌ డ్యూటీ వేయవద్దని.. ఆరోగ్య సమస్యలున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. తాము ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని తెలిపారు.

సుప్రీంకోర్టులో ఉద్యోగులకు న్యాయం జరగలేదని, అయినా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి అడిగితే తమకు రాజకీయాలు ఆపాదించారని, గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించండి అని నినాదాలు చేయించారని తెలిపారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవలేని వారు కూడా తమను విమర్శిస్తున్నారని, ఉద్యోగులతో వైరం మంచిది కాదని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ తమను వివాదంలోకి లాగిందని, తాము ఎప్పుడూ వారితో విభేదించలేదన్నారు. తమపై వ్యాఖ్యలు చేశాకే తాము వ్యాఖ్యలు చేశామని చెప్పారు. ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామన్నారు.

దూకుడు పెంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇద్దరు అధికారులపై చర్యలు, జనవరి 27న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పామని, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించామని తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరగా తాను ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్‌తో చర్చిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కోవిడ్‌ బారిన పడకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు.

ఇప్పటికీ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేరని.. తమ సంఘం జిల్లాల సభ్యులు ఎన్నికలకు వెళ్లలేమని చెబుతున్నారని చెప్పారు. వారిని ఒప్పించి ఎన్నికలకు సహకరిస్తామని, కానీ.. ఉద్యోగులకు కోవిడ్‌ నుంచి పూర్తి రక్షణ కల్పించాల్సిందేనని కోరామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ వయసున్న ఉద్యోగులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరామన్నారు. కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చాకే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటామని, పీపీఈ కిట్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెప్పారని, అవన్నీ జరిగేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.

పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని వెల్లడి, ఎన్నికల వాయిదాకు నిరాకరణ

ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన ఎస్ఈసీ కార్యాలయానికి చేరుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. నిష్పక్షపాత ఎన్నికల‌ నిర్వహణలో ఎన్నికల కమిషనర్‌కి ఐజీ సంజయ్ సహకరించనున్నారు. ఐజీ సంజయ్‌కి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్‌ని కూడా ఏర్పాటు చేశారు.

పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అడ్డు చెప్పారు. కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్‌’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now