AP CID Custody Petition: చంద్రబాబును మా కస్టడీకి అప్పగించండి! పిటీషన్ వేసిన ఏపీ సీఐడీ అధికారులు, రేపు విచారణకు రానున్న పిటీషన్

సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌ (Ap Cid Petition)రేపు విచారణకు రానున్నది. అదే సమయంలో అరెస్టు, రిమాండ్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Chandababu Naidu Credits: X

Vijayawada, SEP 10: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి (Chandrababu Naidu) విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించింది. మరో వైపు కోర్టు తీర్పు వెలువడిన వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో బెయిల్‌ (Bail Petition) పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న చంద్రబాబును గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని ఒకటి, ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు మరొక పిటిషన్‌ వేశారు.

Skill Development Scam: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌, 8 గంటల పాటూ వాదనలు విన్న తర్వాత కూడా ఎటూ తేల్చని న్యాయమూర్తి, ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు 

అదే సమయంలో కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌ (Ap Cid Petition)రేపు విచారణకు రానున్నది. అదే సమయంలో అరెస్టు, రిమాండ్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏసీబీ కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన నేపథ్యంలో ఆయనను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జైలు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, రాజమహేంద్రవరం జైలుకు కూడా తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.