AP Schemes Calendar: ఆంధప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జాతర, జూన్‌లో అమ్మఒడి, జూలైలో కాపు నేస్తం.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం జగన్‌, సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ క్లారిటీ, మరో రెండు కొత్త పథకాలు

ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారు అనే వివరాలు ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. దీనిప్రకారం ఏప్రిల్‌లో వసతి దీవెన(vasathi deevena), వడ్డీలేని రుణాలు, మే లో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా అమలు చేయనున్నారు.

Vijayawada, March 26: ఆంధ్రప్రదేశ్‌ లో 2022-23 సంవత్సరానికి గానూ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను (Schemes Calendar) ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ (April) నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారు అనే వివరాలు ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. దీనిప్రకారం ఏప్రిల్‌లో వసతి దీవెన(vasathi deevena), వడ్డీలేని రుణాలు, మే లో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా అమలు చేయనున్నారు. ఇక జూన్‌లో అమ్మ ఒడి (Amma Vodi) పథకం అమలు చేస్తారు. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర(vahana mitra), కాపు నేస్తం(Kaapu Nestham), జగనన్న తోడు, ఆగస్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం పథకాలు అమలవుతాయి. సెప్టెంబర్‌లో వైఎస్ఆర్ చేయూత(YSR Cheyutha), అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా (Raithu Bharosa), నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు, డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు అమలవుతాయి. జనవరిలో రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా (YSR aasara), జగనన్న తోడు పథకాలు, ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు, మార్చిలో వసతి దీవెన అమలవుతాయి.

తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్‌ కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని జగన్‌ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముగింపు సెషన్‌ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్.సంక్షేమ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను స్వయంగా చదివి వినిపించారు సీఎం జగన్‌. ఇది పేద వర్గాలకు వెల్‌ఫేర్‌ క్యాలెండర్‌ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే మీడియాకు ఏమాత్రం రుచించని క్యాలెండర్‌ అన్నారు. పైగా ఇది చంద్రబాబుకు ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అవుతుందని చెప్పారు సీఎం జగన్‌.

AP Three Capitals Row: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

కరోనా లాంటి సంక్షోభ సమయంలోనూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎక్కడా ఆగలేదని జగన్ గుర్తు చేశారు‌. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అందరూ మనవాళ్లే అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు.

AP Budget Session 2022: మూడు రాజధానుల అంశంపై ధర్మాన కీలక వ్యాఖ్యలు, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే

పైగా లబ్ధిదారులు ప్లాన్‌ చేసుకునేందుకు వీలుగానే కాకుండా.. పారదర్శకంగా, అవినీతి, వివక్షకు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్‌ వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ.. భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని జగన్‌ అన్నారు. మంచి బడ్జెట్‌.. దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకున్నారు జగన్. ఏపీ బడ్జెట్‌ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది.

ఏప్రిల్‌ 2022-2023 మార్చి సంక్షేమ పథకాల క్యాలెండర్‌

* 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు

* మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా

* జూన్‌లో అమ్మ ఒడి పథకం

* జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.

* ఆగస్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం.

* సెప్టెంబర్‌లో వైఎస్ఆర్ చేయూత

* అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా

ఏపీలో కొత్త పథకాలు : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

* నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు

* డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు

* 2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్ఆర్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు

* ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు

* మార్చిలో వసతి దీవెన అమలు



సంబంధిత వార్తలు