International Women’s Day 2022: మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదే, మహిళలకు 51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఏపీ సీఎం జగన్
ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
Vijayawada,Mar 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవసభ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు (International Women's Day celebrations ) డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఎంపీలు బీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గొట్టేటి మాధవి, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day 2022) వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మాట్లాడుతూ.. ప్రతీ అక్క, ప్రతీ చెల్లెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన చుట్టూ ఉన్నది మహిళా ప్రజా ప్రతినిధులేనని చెప్పారు. ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని తెలిపారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేశామని తెలిపారు. మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని అన్నారు. దేశ చరిత్రలోనే ఇంత మంది మహిళా ప్రజాప్రతినిధులతో సభ జరిగి ఉండదని తెలిపారు. జడ్పీ ఛైర్ పర్సన్‌లుగా 54శాతం మంది మహిళలే ఉన్నారని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్, వాట్సప్ స్టేటస్ మీకోసం
13 జడ్పీ చైర్మన్‌లతో ఏడుగురు మహిళలేనని తెలిపారు. మహిళలకు 51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లుగా 64 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రెండున్నర ఏళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వెఎస్సార్ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. వాలంటీర్లుగా 53 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు.
అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకు రూ.13వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ చెల్లిస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.2,354కోట్లు నేరుగా జమ చేశామని పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.9,180 కోట్లు సాయం అందించామని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన చేతిలో పెన్షన్ పెడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్, వాట్సప్ స్టేటస్ మీకోసం
మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీ మహిళలకు దక్కిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలను సీఎం జగన్ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ లాంటి మహిళా పక్షపాతి.. దేశంలోనే ఉండరని తెలిపారు. నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్ రావాలని అన్నారు. సీఎం జగన్ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని తెలిపారు. సీఎం జగన్ మహిళలను మహారాణులను చేశారని గుర్తుచేశారు. మహిళ బావుంటే, కుటుంబం బావుంటుందని నమ్మే వ్యక్తి.. సీఎం జగన్ అని అన్నారు. సీఎం జగన్ మహిళలందరికీ దేవుడితో సమానమని రోజా తెలిపారు.
మహిళ సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేయాలనేది మహానేత వైఎస్సార్ కల అని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మహిళలను దగా చేశారని తెలిపారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.