Comprehensive Land Survey in AP: ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే, భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్, 2023 ఆగస్టు నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే (Comprehensive Land Survey in AP) చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2023, ఆగస్టు నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
Amaravati, August 31: ఏపీలో భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే (Comprehensive Land Survey in AP) చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2023, ఆగస్టు నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ప్రజెంటేషన్ సమర్పించారు. ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం
రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఇది వరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. మనుషులకు ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) ఇచ్చినట్లుగా ప్రతి ల్యాండ్ బిట్‌కు భూధార్ నంబరు కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జూన్ 2న జీఓ జారీ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో రీసర్వే ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
దీంతోపాటు కొన్ని పరికరాల కొనుగోలుకు అనుమతి కోరారు. ‘రీసర్వే ఫేజ్–1, ఫేజ్–2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల స్థాయి పెంపు, నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలి. 11,158 రోవర్స్ కొనుగోలుకు పరిపాలనామోదం ఇవ్వాలి’ అని సర్వే డైరెక్టర్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతించింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని ఆదేశించింది.