Amaravati. August 30: అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం కొత్త ప్రయత్నాలను చేస్తూ సత్ఫలితాలను (Additional Revenue to AP Govt) రాబట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం (additional revenue) లభించింది. గత ప్రభుత్వం కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై మరోసారి చర్చలు జరపడం ద్వారా ఆ ఆదాయన్ని రాబట్టింది.
వివరాల్లోకెళితే.. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్‌కో విద్యుత్ ప్రాజెక్టు (Kurnool Ultra Mega Solar Park),భోగాపురంలో జీఎమ్మార్ చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకు (GMR Bhogapuram Airport) ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఆయా సంస్థలతో ఏపీ సర్కారు (AP Govt) మరోసారి చర్చలు జరిపింది. సీఎం వైఎస్ జగన్ ( CM YS Jagan) సూచనల మేరకు ఆయా సంస్థలతో అధికారులు జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలనివ్వడంతో ప్రభుత్వానికి రూ.4,881 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించింది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్‌కో విద్యుత్తు ప్రాజెక్టు కోసం 4,766.28 ఎకరాల భూమి ఇచ్చేలా 2018 జూలైలో ఒప్పందం కుదిరింది. ఎకరా కేవలం రూ.2.5 లక్షలకే గత సర్కారు కేటాయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మరోసారి కంపెనీతో చర్చలు జరపడంతో ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. అవే ప్రమాణాలతో విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది. ఎకరానికి రూ.2.5 లక్షల చొప్పున అదనపు ఆదాయం రావడంతో ప్రభుత్వానికి ఇందులో మొత్తం రూ.119 కోట్ల మేర అదనపు ఆదాయం లభించినట్‌లైంది. దీంతో పాటు సోలార్/విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసే 1,550 మెగావాట్లలో కూడా మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు కంపెనీ అంగీకరింది. తద్వారా ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్ల వ్యవధిలో రూ.322 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. పనులు రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అలాగే రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తయ్యే 1,680 మెగావాట్ల విద్యుత్తులో మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో ఏడాదికి రూ.16.8 కోట్లు, ఆ తరువాత ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 2,940 కోట్ల మేర అదనంగా ఆదాయం రానుంది. గ్రీన్‌కో విద్యుత్తు ప్రాజెక్టు యాజమాన్యంతో చర్చలు జరపడం ద్వారా రూ.3,381 కోట్ల మేర ప్రభుతానికి అదనపు ఆదాయం లభించింది. ఆడపిల్లల రక్షణ కోసం ఎనిమిది స్పెషల్ కోర్టులు, కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
గత ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం కోసం 2,703 ఎకరాలను కేటాయించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపడంతో 2,203 ఎకరాల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి జీఎమ్మార్ సంస్థ ముందుకొచ్చింది. గతంలో ఒప్పందం సమయంలో పేర్కొన్న ప్రతి సదుపాయాన్నీ కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కంపెనీతో మరోసారి చర్చలు జరపడం ద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున లెక్కించినా ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్లేనని తెలుస్తోంది.