CM Jagan Key Decesion: జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం, ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య, సమగ్ర సర్వే కోసం కమిటీల ఏర్పాటు, అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వులు
ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య (New survey on industries) కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం (YS Jagan Govt) ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో పనిచేయనుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో జగన్ ప్రభుత్వం వెల్లడించింది.
Amaravati, August 13: పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం (CM Jagan Key Decesion) తీసుకున్నారు. ఏపీలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య (New survey on industries) కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల సర్వే కోసం ప్రభుత్వం (YS Jagan Govt) ఉత్తర్వులు జారీ చేసింది.
సమగ్ర సర్వే కోసం కొన్ని కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో పనిచేయనుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో జగన్ ప్రభుత్వం వెల్లడించింది.
కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఇతర వనరులు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మొత్తం 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే వివరాలు సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల్లో వివరాలను సేకరించనున్నది. ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట, క్రైమ్ డిటెక్షన్ సాధించినందుకు 103 మంది పోలీసులకు ఎబిసిడి అవార్డులు, జాతీయ స్థాయిలో 26 అవార్డులు, సంతోషం వ్యక్తం చేసిన డీజీపీ సవాంగ్
కాగా.. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది వివరాలు సేకరించనుంది.ఇకపై ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్టు దీని ద్వారా తెలుస్తోంది.