Amaravati, August 13: రాష్ట్ర పోలీసు కార్యాలయంలో బుధవారం క్రైమ్ డిటెక్షన్ సాధించినందుకు కానిస్టేబుల్ నుండి డిఎస్పి స్థాయి వరకు 103 మంది పోలీసు సిబ్బందికి ఉత్తమ నేర గుర్తింపు (ABCD awards) అవార్డును పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ (Director General of Police D Gautam Sawang)అందజేశారు. రాష్ట్రంలో గత తొమ్మిది నెలలుగా నమోదైన పలు కేసుల దర్యాప్తులో సత్తా చాటి, శిక్షలు పడేలా చేసిన పోలీసు అధికారులకు ఆయన ఏబీసీడీ అవార్డులు (Award for the Best Crime Detection) అందజేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ బాస్ మాట్లాడారు.
అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుని స్థిరత్వంతో దర్యాప్తు చేస్తే ఎటువంటి కేసుల్లో అయినా కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. నేరాల దర్యాప్తులో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవాలి’’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు (Andhra Pradesh police) సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసులు ఛేదించి అవార్డులు పొందిన పోలీసుల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందాలన్నారు.
ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు... ఒక్కో త్రైమాసికానికి నాలుగు చొప్పున మూడు త్రైమాసికాలకు ఒకేసారి ఇచ్చారు. వీటితోపాటు ఎస్‌సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచే వారికి కొత్తగా మరో అవార్డు ప్రవేశ పెట్టారు. మొత్తం 13 మంది దర్యాప్తు అధికారులతోపాటు ఆ బృందంలోని పోలీసులకు డీజీపీ సవాంగ్ (Damodar Gautam Sawang) అవార్డులు అందజేశారు.
Prakasam Police Tweet
Prakasam Police Bags State Police Top Honour (ABCD Award); For cracking Sensational double murder & Online money fraud cases.#ModernPolicing #ABCDawards #IPS#SiddharthKaushal #APPolice #PrakasamPolice @dgpapofficial pic.twitter.com/U9VtCCwJlH
— Prakasam Police (@prakasam_police) August 12, 2020
Anantapur Police tweet
Another Team of ABCD award winners From Anantapur District Police receiving the commendation certificates from
𝐒𝐫𝐢 𝐆𝐮𝐚𝐭𝐡𝐚𝐦 𝐒𝐚𝐰𝐚𝐧𝐠,𝐈𝐏𝐒.,
Hon’ble DGP AP @APPOLICE100@dgpapofficial pic.twitter.com/gaZAOVkLRF
— Anantapur Police (@AnantapurPolice) August 12, 2020
సత్తా చాటిన విశాఖపట్నం పోలీసులు
కోల్‌కతా కేంద్రంగా ఆన్‌లైన్‌లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి యువకులను మోసం చేసి వారి నుంచి డబ్బులు గుంజేస్తున్న(హ నీట్రాప్) ముఠా గుట్టును విశాఖ నగర సైబర్ క్రైమ్ పోలీసులు గత ఏడాది జూలైలో రట్టు చేశారు. ఈ కేసులో 26 మంది ముఠా సభ్యులను అరెస్టు చేయడంతోపాటు వారి నుంచి మోసాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు కోల్‌కతా కేంద్రంగా ఒక కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. పాపులర్ ఫాంటీసీ డాట్‌కామ్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
Here's AP Police Tweet
#ABCD (Award for Best in Crime Detection) AWARDS Presentation by #APDGP
3rd Quarter (July-Sep) - 2019,
4th Quarter (Oct-Dec) - 2019 &
1st Quarter (Jan-Mar) - 2020https://t.co/9hDnPSThVR#APPolice
— AP Police (@APPOLICE100) August 12, 2020
అందులో అందమైన యువతుల ఫొటోలను పెట్టేవారు. వెబ్‌సైట్‌ను క్లిక్ చేసిన యువతకు సెక్స్‌తోపాటు రూమ్‌లు కూడా కల్పిస్తామంటూ ఆఫర్ ప్రకటిస్తారు. ఎవరైనా ఆసక్తితో వెబ్‌సైట్‌లోని అడ్రస్‌ను సంప్రదిస్తే వలలో వేస్తారు. దీనిపై ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గత ఏడాది జూలై 28న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన అప్పటి సీఐ గోపీనాధ్, ఎస్‌ఐ మనోజ్ కుమార్ దీనిపై దర్యాప్తు నిర్వహించి గుట్టురట్టు చేశారు. ఈ కేసుకు గానూ అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్(ఏబీసీడీ) కన్సోలేషన్ బహుమతికి విశాఖ నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఎంపికయ్యారు. బహుమతిని డీజీపీ గౌతమ్‌సవాంగ్ బుధవారం విజయవాడలో అందజేశారు.
రూ.5కోట్ల విలువైన సెల్‌ఫోన్ల కేసును చేధించిన నెల్లూరు పోలీసులు
బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్‌లోని దగదర్తి పోలీసు స్టేషన్ పరిధిలో 2019లో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న ఓ లారీలోని రూ.5కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దుండగులు అపహరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు, చిల్లకూరు ఎస్సై హుస్సేన్‌బాబు, గూడూరు రూరల్ స్టేషన్ హెచ్‌కానిస్టేబుల్ ఆర్‌వీరాజు ఆత్మకూరు కానిస్టేబుల్ కేశవ కీలకంగా వ్యవహరించారు. నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభకనబరిచిన వీరిని అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్( ఏబీసీడీ) అవార్డులు వరించాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేసి అభినందించారు.
అనంతపురం జిల్లా పోలీసుశాఖ
అనంతపురం జిల్లా పోలీసుశాఖకు రాష్ట్రస్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. జిల్లాలో రెండు కీలక కేసుల దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసుల సేవలను రాష్ట్ర పోలీసుశాఖ గుర్తించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి అందించే ఏబీసీడీ అవార్డుల్లో జిల్లాకు ఈ సారి రెండు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏబీసీడీ అవార్డులను ప్రకటించగా అనంతపురం జిల్లాను రెండు వరించాయి. అమరావతిలో నిర్మాణాలపై ఏపీ సీఎం రివ్యూ, ప్రారంభానికి సిద్ధమైన కనకదుర్గ ఫ్లైఓవర్, 15వ తేదీ సాయంత్రం వరకు విజయవాడలో పలు ఆంక్షలు
అనంతపురం జిల్లాలో తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలోని శివాలయంలో గతేడాది ట్రిపుల్ మర్డర్ (పూజారితో పాటు మరో ఇద్దరిని) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం జోడించి, కేసును ఛేదించారు. ఈ కేసులో కదిరి డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్, కదిరి రూరల్ సీఐ తమ్మిశెట్టి మధు, తనకల్లు ఎస్‌ఐ రంగుడు యాదవ్, టెక్నికల్ ఎస్‌ఐ క్రాంతికుమార్, కానిస్టేబుళ్లు మూర్తి, యాసర్‌ఆలీ ప్రతిభ కనబరిచారు. కరోనాపై ఊరట..ఏపీలో లక్షా అరవై వేలకు పైగా డిశ్చార్జ్ కేసులు
ఇక బుక్కపట్నం మండలం సిద్దరాంపురంలో గతేడాది ఓ గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు చాకచక్యంగా హత్య చేసి, పోలీసులకు ఆనవాళ్లు దొరకకుండా కాల్చేశారు. నెలలోగా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, పుట్టపర్తి రూరల్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, బుక్కపట్నం ఎస్‌ఐ విజయకుమార్, టెక్నికల్ సిబ్బంది కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కేసును ఛేదించారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వారిందరినీ జిల్లా ఎస్పీసత్యఏసుబాబుతోపాటు రాష్ట్ర స్థాయిలో రెండు ఏబీసీడీ అవార్డులను ప్రకటించి, ప్రశంసించారు.
సత్తా చాటిన నూజివీడు పోలీసులు
అత్యుత్తమ నేర పరిశోధనలో రాష్ట్ర స్థాయిలో నూజీవీడు పోలీసులు 10 ఏబీసీడీ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన రాత్రి నూజీవీడు శివారు ప్రాంతంలో 10 సంవత్సరాల బాలిక తన తండ్రి కోసం ఎదురుచూస్తుండగా గుర్తె తెలియని వ్యక్తి మీ నాన్న వద్దకు తీసుకువెళ్తానంటూ బాలికను సైకిల్ మీద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి వెళ్లిపోయాడు.
ABCD Awards
#ABCDAwards: #AndhraPradesh @dgpapofficial Gautam Sawang presents best crime detection awards to police for their outstanding investigation.12 teams recieved awards for 3rd and 4th quarters of 2019 and 1st quarter of 2020.@NewIndianXpress@xpressandhra@APPOLICE100#Vijayawada pic.twitter.com/fPWVpFM6Pp
— Phanindra Papasani (@PhanindraP_TNIE) August 12, 2020
సవాలుగా మారిన ఈ కేసును చేధించేందుకు ఎస్పీ రవీంద్రబాబు దర్యాప్త కోసం తొమ్మిది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడంతో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా 36 గంటల వ్యవధిలో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రతిభకు గానూ నూజీవీడు సీఐ రామచంద్రరావు, ఎస్సైలు సీహెచ్ రంజిత్ కుమార్, శ్రీనివాసరావు, సత్యానారాయణ, ముసునూరు ఎస్సై రాజారెడ్డి, సీసీఎస్ ఎస్సై నారాయణ స్వామి, ఎస్భీ ఎస్సై సతీష్ కుమార్, పీసీలు బాల రమేష్, రాజేష్, బాజీబాబులు ఏబీసీడీ అవార్డులను అందుకున్నారు. మొత్తం పది అవార్డులను కృష్ణా జిల్లా కైవసం చేసుకుంది. అవార్డులు అందుకున్న వారికి నూజివీడు ఎస్పీ రవీంద్రబాబు, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.
జాతీయస్థాయిలో 26 అవార్డులు
ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖకు వివిధ అంశాల్లో జాతీయస్థాయిలో 26 అవార్డులు దక్కాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అభివృద్ధి మార్పులు, టెక్నాలజీ వంటి వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. ఆయన ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ రిహార్సల్స్ లో పాల్గొని పోలీసు, భద్రతా,రిజర్వ్ బలగాలు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చీరాల ఘటనలో ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు.
రాజమండ్రి శిరోముండనం ఘటనపై డీజీపీ స్పందిస్తూ తమ దృష్టికి రాగానే ఎస్‌ఐని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. తన 34 ఏళ్ల సర్వీసులో ఒక పోలీసు అధికారిని ఇంత త్వరితగతిన అరెస్ట్ చేసింది లేదని, ఇదే ప్రథమం అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేసులకు వెనుకాడవద్దని పోలీస్‌శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురిని అరెస్ట్ చేశామని డీజీపీ వెల్లడించారు.