CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, August 13: అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై (Amaravathi Metropolitan Area Development) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM Jagan Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో (Amaravathi) ప్రస్తుతం ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని, ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. హ్యపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

బెజవాడ నగరంలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ( Kanaka Durga flyover) ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ (durga temple flyover) సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్‌ టెస్ట్‌’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కుమ్మరిపాలెం నుంచి వినాయక గుడి వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. విజయవాడ వైపు వచ్చే భారీ వాహనాలు/ ఇతర వాహనాలు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి-సితార సెంటర్-కబేలా-సీవీఆర్ ఫ్లై ఓవర్- ఇన్నర్ రింగ్రోడ్డు-పైపుల రోడ్ జంక్షన్- రామవరపడు రింగ్‌రోడ్డు మీదగా జాతీయ రహదారి 65కి మీదగా వెళ్లాలని నగర అదనపు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కరోనాపై ఊరట..ఏపీలో లక్షా అరవై వేలకు పైగా డిశ్చార్జ్ కేసులు

హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కృష్ణలంక పోలీస్స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్- పంజా సెంటర్- చిట్టినగర్- సొరంగం- గొల్లపూడి - ఇబ్రహీంపట్నం మీదగా వెళ్లాలని పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతకు ముందుగా ‘లోడ్‌ టెస్ట్‌’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు లోడ్‌ టెస్ట్‌ను కొనసాగించనున్నారు.  మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఒంగోలులో మరోసారి కంటైన్‌మెంట్‌ ఆంక్షలు విధించిన కలెక్టర్ పోల భాస్కర్, రెండు వారాల పాటు అమల్లోకి..

24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్‌ రన్‌లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్‌ అండ్‌ బీ (క్వాలిటీ కంట్రోల్‌) సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ జాన్‌ మోషే తెలిపారు.