Representational Image (Photo Credits: IANS)

Ongole, August 12: ప్రకాశం జిల్లాలో ప్రధాన పట్టణం ఒంగోలు నగరంలో (Lockdown in Ongole) కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు (Lockdown Extension) చేపట్టారు. మరోసారి లాక్‌డౌన్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తికి చెక్‌ చెక్‌ పెట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటి వరకు కొన్ని రకాల సడలింపులతో పరిమిత ఆంక్షలు విధిస్తూ వచ్చిన అధికారులు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కంటైన్‌మెంట్‌ ఆంక్షలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో నగరపాలక సంస్థ పరిధిలో పటిష్టమైన లాక్‌డౌన్‌ అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌ పోల భాస్కర్‌ (collector Dr Pola Bhaskara) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతించారు. మెడికల్‌ షాపులు తెరుచుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. మిగిలిన ఎటువంటి వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 25 లక్షల కరోనా పరీక్షలతో ఏపీ రికార్డు, తాజాగా 9,024 మందికి కోవిడ్-19 పాజిటివ్, రాష్ట్రంలో 2,44,549కు చేరిన కరోనా కేసుల సంఖ్య, మొత్తంగా 87,597 యాక్టివ్‌ కేసులు

తొమ్మిది గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలిచ్చారు. అత్యవసర సేవలకు, విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా గుర్తింపు కార్డులను విధిగా వెంట ఉంచుకోవాలి. ఈ నింబంధనలు రెండు వారాలపాటు పక్కాగా అమలు కానున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కమిషనర్‌ పిడతల నిరంజన్‌రెడ్డి, ఒంగోలు తహసీల్దార్‌ కె.చిరంజీవి కోరారు. ప్రకాశం జిల్లలో ఇప్పటివరకు 9328 కేసులు నమోదయ్యాయి. 343 మరణాలు సంభవించాయి. మొత్తం 3396 కేసులు యాక్టివ్ గా ఉండగా 5803 మంది రికవరీ అయ్యారు.