Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, August 11: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 58,315 కోవిడ్-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus Report) తేలింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. కొత్త కేసులతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య (coronavirus cases) 2,44,549 కు చేరింది. కొత్తగా 9,113 మంది వైరస్‌ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులున్నాయి.

వైరస్‌ బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య (Coronavirus Deaths) 2203 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,92,619 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Here's AP Corona Report

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు 46,999 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 25,34,304కు చేరినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో తాజాగా 53,601 కరోనా కేసులు నమోదు, 22 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసులు, గత 24 గంటల్లో 871 మరణాలు, ఇప్పటివరకు కోవిడ్-19తో 45,257 మంది మృతి

ఇప్పటి వరకూ 25 లక్షలకు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా మిలియన్‌ జనాభాకు 47,459 పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.