Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు రూ. 10 వేలు, నవంబర్ 6న జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ఫుట్‌పాత్‌లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు (Street vendors) రూ.10 వేల చొప్పున రుణాలు అందించే ‘జగనన్న తోడు’ (Jagananna Thodu Scheme) పథకాన్ని ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Amaravati, Nov 3: ఏపీ సీఎం వైయస్ జగన్ మరో పథకానికి నవంబర్ 6న శ్రీకారం చుట్టనున్నారు. ఫుట్‌పాత్‌లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు (Street vendors) రూ.10 వేల చొప్పున రుణాలు అందించే ‘జగనన్న తోడు’ (Jagananna Thodu Scheme) పథకాన్ని ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీధి వ్యాపారులు తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది.
ఫుట్‌పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బుట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. సంప్రదాయ వృత్తులైన ఇత్తడి పని చేసే వారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మల అమ్మకందారులతో పాటు కుమ్మరి వారికి సైతం ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.
ఇదిలా ఉంటే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా తమను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం బడుగుమాకులపల్లి నుంచి మండల సచివాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఎంపీ రెడ్డెప్ప, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు దాదాపు కిలోమీటరు మేర వరుస కట్టాయి. ర్యాలీ మధ్యలో కేజీఎఫ్ సర్కిల్‌లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూజలు చేసి నివాళి అర్పించారు. బాణాసంచా మోత, జై జగన్ నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది.