Housing for Poor Scheme: 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, ఉగాది నుంచి అంబేద్కర్ జయంతికి వాయిదా వేసిన ఏపీ సర్కారు, కరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jagan) ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ (Coronavirus) నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Amaravati, Mar 21: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని (Housing for Poor Scheme) ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jagan) ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ (Coronavirus) నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా?
జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఈ సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజుకు వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, జాగ్రత్తలు తీసుకుని వారికి స్థలాలను చూపించాలని ఆదేశించారు.
ఏపీలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేత
సుమారు 27 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నారు. పేదలకు ఇస్తున్న ప్లాట్లు, వాటిని అభివృద్ధి చేసిన తీరును సవివరంగా తెలియజెప్పాలని సీఎం తెలిపారు. అలాగే ప్లాట్లను ముందుగానే అలాట్ చేస్తూ లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలి. వారి వారి ప్లాట్ల వద్ద లబ్ధిదారులను నిలుచోబెట్టి ఫొటో తీయాలి.
ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి
జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం కేటాయించాలన్నారు. ఈ పథకం ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి రోజున అట్టహాసంగా జరగనుంది.