CM YS Jagan Review: ఏపీలో కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, విలేజ్‌ క్లినిక్స్‌‌పై వెంటనే దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌, హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో (AP CM YS Jagan reviews on health dept) సమీక్షించారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Oct 6: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో (AP CM YS Jagan reviews on health dept) సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని.. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా ( construction of Village Clinics) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామని సీఎం జగన్‌ తెలిపారు.

ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా, 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులు

స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని.. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపట్టాలన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టి.. దాని రిఫరెల్‌ మీద ప్రచారం ఉండాలని.. ఆరోగ్య మిత్రల ఫోన్‌నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలలని సీఎం ఆదేశించారు.ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని అలానే 108 వెహికల్స్‌ సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు.

అలర్ట్ న్యూస్..ఏపీలో అక్టోబర్ నెలంతా వర్షాలే, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో జోరుగా వానలు కురిసే అవకాశం

హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్‌ తెలిపారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగావైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం జగన్‌ 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలన్నారు. డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు క్రియేట్‌చేస్తున్నామని అధికారులు తెలియజేశారు.



సంబంధిత వార్తలు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం