AP Global Investment Summit 2023: పారిశ్రామికరంగ నిపుణులు, వ్యాపారుల రాకతో విశాఖ ధగధగ.. నేడు, రేపు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు.. కార్పొరేట్‌ దిగ్గజాలతోపాటు 45కుపైగా దేశాల నుంచి ప్రతినిధుల రాక.. పూర్తి వివరాలు ఇవే.. వీడియోతో

2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దేశ, విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023కు వేదికగా ఆర్థిక రాజధాని విశాఖ సిద్ధమైంది.

Global Investors Summit, Vishakhapatnam March 3-4, 2023

Visakhapatnam, March 3: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దేశ, విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023కు (AP Global Investment Summit 2023) వేదికగా ఆర్థిక రాజధాని విశాఖ (Visakha) సిద్ధమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం.

విశాఖకు చేరుకున్న సీఎం జగన్, రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, సమ్మిట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం

సదస్సు ప్రారంభం ఎప్పుడు?

నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం 25 ఎకరాల స్థలం కేటాయించారు.

హాజరవనున్న అతిరథులు

ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్, అర్జున్‌ ఒబెరాయ్, సజ్జన్‌ జిందాల్, నవీన్‌ జిందాల్, మార్టిన్‌ ఎబర్‌ హార్డ్డ్, హరిమోహన్‌ బంగూర్, సజ్జన్‌ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు.

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌, విజయవంతం కావాలని ఆకాంక్షించిన తెలంగాణ మంత్రి

భద్రత ఎలా?

25 చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ లో సదస్సుకు పారిశ్రామికవేత్తలు చేరుకోనున్నారు. విమానాల పార్కింగ్‌ కోసం విశాఖ, రాజమండ్రిలో ఏర్పాట్లు చేశారు. కార్పొరేట్‌ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్‌ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు.