Spandana Program: జూన్ 20 తర్వాత ఏపీలో కొన్ని సడలింపులతో కర్ఫ్యూ, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

కరోనా నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈనెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు.

AP Chief Minister YS Jagan inaugurated the Amul project (Photo-Video Grab)

Amaravati, June 16: కరోనా నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈనెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని, గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్నారు. స్పందన కార్యక్రమంపై (Spandana Program) కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ (AP CM YS Jagan Video Conference) నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి.. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల అందుబాటు.. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దన్నారు.

మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి. ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు. ఫోకస్‌గా టెస్టులు చేయాలని, గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగించాలన్నారు. ఎవరు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే కార్యక్రమం ప్రతి వారం కొనసాగాలన్నారు.

నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం, తుపాకీతో బంధువును కాల్చి చంపి...తానూ కాల్చుకుని మృతి చెందిన వైసీపీ నేత, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలి. ఎవరైనా కోవిడ్‌పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలి. అన్ని టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలి. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నా. 89శాతం మంది కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారు. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరికీ అభినందనలు తెలియచేస్తున్నా. ఈరోజు 16వేలమందికిపైగా కోవిడ్‌ ట్రీట్‌ మెంట్‌జరుగుతుంటే.. 14 వేలమందికిపైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలని సీఎం అన్నారు.

వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. 104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్‌ చేసుకోవాలి. కోవిడ్‌ సంబంధిత అంశాలకు 104 అనేది ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. వారానికి ఒకసారి ఫీవర్‌క్లినిక్స్‌ కూడా కచ్చితంగా నిర్వహించాలి. మనం గుర్తిస్తున్న అంశాలను కూడా ఫాలోఅప్‌ చేయాలి.థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదు. మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు.

ఏపీలో భారీగా పెరిగిన డిశ్చార్జి రేటు, అదే సమయంలో తగ్గుతున్న రోజూ వారి కేసులు, కొత్తగా 5,741 కరోనా కేసులు, ఒక్కరోజులో 10,567 మంది కోలుకుని డిశ్చార్జ్, కరోనా ధర్ఢ్ వేవ్ హెచ్చరికల నేఫథ్యంలో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి. నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. నిర్దేశించుకున్న మార్గదర్శకాలను తప్పక పాటించాలి. మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ఇవ్వాల్సి ఉంటే... ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. మరో 69,0,710 మందికి మాత్రమే ఒకడోసు ఇవ్వగలిగాం. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలి. ఇ– క్రాపింగ్‌బుకింగ్‌అనేది చాలా ముఖ్యం. ఇ– క్రాపింగ్‌ చేయకపోతే... కలెక్టర్‌ విఫలయం అయ్యారని భావించవచ్చు. కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలి. దిగువనున్న సిబ్బంది కూడా ఇ– క్రాపింగ్‌ను పర్యవేక్షించాలని సీఎం తెలిపారు.

3.7లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు

జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం కోవిడ్‌కారణంగా ఆశించినంత వేగంగా కదల్లేదు. ఇది పూర్తయితే వివాదాలకు పూర్తిగా చెక్‌ పడుతుంది. ఇప్పుడు ఈకార్యక్రమంపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా స్పందనలో దీనిపై రివ్యూ చేస్తాను. ఈ కార్యక్రమం ప్రగతిని పర్యవేక్షిస్తాను. కోర్టు కేసుల కారణంగా 3,70,201 మందికి ఇళ్లస్థలాలు రాలేదు. పేదవాడికి ఇంటి పట్టాలు రాకూడదని టీడీపీ లాంటి ప్రతిపక్షాలు అన్యాయంగా కేసులువేసి అడ్డుకున్నాయి. ఇప్పుడు హైకోర్టు సెలవులు కూడా ముగిశాయి. ఇప్పుడు ఇలాంటి కేసులమీద దృష్టిపెట్టండి. ప్రతిరోజూ రివ్యూ చేసి చర్యలు తీసుకోండి. కలెక్టర్లు, జేసీలు ఈ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోండి. దీనిమీద ప్రత్యేకమైన ధ్యాసపెట్టాలి. దీనివల్ల 3.7లక్షలకుపైగా కుటుంబాలకు ఎనలేని మేలు జరుగుతుంది.

అలాగే 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలి. 1.72 లక్షలమందికిపైగా అర్హులని అధికారులు తేల్చారు. ఇందులో 38వేల మందికి ఇప్పుడున్న ఉన్న లేఅవుట్లలోనే పట్టాలు ఇస్తున్నారు. మరో 9,794 మందికి కొత్త లే అవుట్లలో ఇస్తున్నారు. వీరికి వచ్చే స్పందనలోగా పట్టాలు ఇవ్వాలి. పెండింగులో 11,741 దరఖాస్తులను వచ్చే స్పందనలోగా పరిష్కరించాలి. 1.24లక్షల మందికి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలి.

ఇళ్లనిర్మాణం

తొలివిడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. జగనన్నకాలనీల్లో 4,120 కాలనీల్లో తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన కాలనీల్లో జూన్‌ నెలాఖరు కల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాలను ఏర్పాటు పూర్తికావాలి. సొంత స్థలాలు ఉన్నవారికి 3.84 ఇళ్లు ఇచ్చాం. వాటిని శరవేగంగా పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి: ఇళ్లనిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. దీనివల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయి. తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు కావాలి.

జూన్‌ 20 తర్వాత సడలింపులు

జూన్‌ 20 తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 22న చేయూత పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనికి కలెక్టర్లు అంతా సిద్ధంకావాలి.జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తాం. దీనికి సంబంధించి కూడా కలెక్టర్లు సిద్ధంకావాలి. వైఎస్సార్‌ బీమా జులై 1న ప్రారంభం అవుతుంది.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా

Share Now