Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, June15: ఏపీలో గడిచిన 24 గంటల్లో 96,153 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 5,741 కరోనా కేసులు (COVID in AP) బయటపడ్డాయి. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 18,20,134కు (Coronavirus in AP) చేరుకుంది. గత 24 గంటల్లో 53 మరణాలు (Covid Deaths) చోటుచేసుకోగా.. మొత్తంగా మరణాల సంఖ్య 12,052కు Coronavirus Deaths in AP) చేరింది.

ఇక కరోనా నుంచి ఒక్కరోజులో 10,567 మంది కోలుకోగా.. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,32,984గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 75,134 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,06,34,891 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 12 మంది, తూ.గో జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 839 కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ మరణం, అధికారికంగా ధృవీక‌రించిన ప్రభుత్వం, వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత అనఫిలాక్సిస్‌తో మరణించిన 68 ఏళ్ల వ్య‌క్తి

కరోనా థర్డ్‌వేవ్‌ (Coronavirus Third Wave) హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్టారెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలో కనుమరుగవుతున్న సెకండ్ వేవ్, కొత్తగా 60,471 మందికి కోవిడ్, 2,726 మంది మృతి, దేశంలోకి మరో వ్యాక్సిన్ ఎంట్రీ, అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న జైడస్ క్యాడిలా జైకోవ్‌-డీ వ్యాక్సిన్

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, చిన్నారులకు వైద్యం కోసం అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని, జనావాసాలకు దగ్గరగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నారులకు వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌ను పరిశీలించాలన్నారు. చిన్నారులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

థర్డ్‌వేవ్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని తెలిపారు. బ్లాక్ ఫంగ్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు.