Niger, July 27: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లో (Niger) తిరుగుబాటు జరిగింది. అక్కడ అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం (Niger Soldiers) ప్రకటించింది. ఈ ఆకస్మిక పరిణామం నైజర్ చుట్టుపక్కల ఉన్న ఆఫ్రికా దేశాలను కలవరానికి గురించేసింది. అయితే, సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించబడింది. సైనికులు తిరుగుబాటును జాతీయ టెలివిజన్‌లో ప్రకటించారు. ఈ ప్రకటనలో నైజర్‌లోని అన్ని సంస్థలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సైన్యం తెలిపింది. కల్నల్ మేజర్ అబ్ద్రమనే తన ప్రకటనను చదువుతున్నప్పుడు అతని పక్కన మరో తొమ్మిది మంది అధికారులు ఉన్నారు. ఈ బృందం తనను తాను దేశ జాతీయ భద్రతా మండలిగా పిలిస్తోంది. స్థానిక వార్తాసంస్థల కథనం ప్రకారం.. నైజర్ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను (Mohamed Bazoums) అధికారం నుంచి సైన్యం తొలగించింది. అధ్యక్షుడిని అరెస్టు తరువాత సైనికుల బృందం గురువారం జాతీయ టెలివిజన్‌లో కనిపించి తిరుగుబాటును ప్రకటించింది.
COUP D'ETAT IN NIGER
- Group of soldiers appear on state TV
- Announce President Bazoum has been removed
- Order 7 pm-5 am nationwide curfew
- Borders closed until further notice
- Bazoum appears to have been detained
- Niger is Western ally in fight against terror pic.twitter.com/iHJ3XbaF1s
— BNO News (@BNONews) July 26, 2023
ఈ ఘటనపై అమెరికా నుంచి ఘాటైన ప్రకటన వెలువడింది. బజౌమ్‌ను వెంటనే విడుదల చేయాలని యూఎస్ పిలుపునిచ్చింది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ న్యూజిలాండ్‌లో విలేకరులతో మాట్లాడారు. నేను ఈ ఉదయం ప్రెసిడెంట్ బజౌమ్ తో మాట్లాడాను. నైజర్ లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన అధ్యక్షుడిగా యూఎస్ అతనికి గట్టిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశాను. మేము అతనిని వెంటనే విడుదల చేయాలని సైన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. నైజర్‌కు సహాయం ప్రజాస్వామ్య పాలనపై ఆధారపడి ఉంటుందని ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.
ఇదిలాఉంటే ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు తనపై తిరుగుబాటుకు ప్రయత్నించారని నైజర్ ప్రెసిడెంట్ చెప్పారు. నైజర్ అధ్యక్షుడు బజౌమ్ 2021లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యారు. నైజర్ ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాలకు సన్నిహిత మిత్రదేశంగా పరిగణలో ఉంది. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి నైజర్‌లో తిరుగుబాట్లు జరిగాయి. అంతేకాకుండా పలుమార్లు తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. ఈ దేశంలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన గ్రూపులు చురుగ్గా ఉన్నాయి.
నైజర్‌లో సైన్యం తిరుగుబాటు పరిణామాలపై అల్ జజీరా జర్నలిస్ట్ మైక్ వాన్నా మాట్లాడుతూ.. నైజర్ లో తాజా పరిణామాలు యూఎస్‌కి ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఎందుకంటే వారికి నైజర్ లో రెండు డ్రోన్ స్థావరాలు ఉన్నాయి. వారివద్ద దాదాపు 800 మంది సైనికులుకూడా ఉన్నారు. వీరిలో కొందరు ప్రత్యేక దళాలు నైజర్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నాయి.