New Delhi, June 15: కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్.. ఇండియాలో వ్యాక్సిన్ తర్వాత తొలి మరణాన్ని (First Death Linked to COVID-19 Vaccine) ధృవీకరించింది. 68 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనఫిలాక్సిస్‌తో (Anaphylaxis Post Vaccination)చనిపోయినట్లు తేల్చింది. వ్యాక్సిన్ తర్వాత కలిగే తీవ్ర దుష్ప్రభావాలకు సంబంధించి నిపుణుల బృందం రిపోర్ట్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర దుష్ప్రభావాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అందులో ఒక వ్యక్తి మాత్రం అనఫిలాక్సిస్ వల్ల చనిపోయినట్లు తేల్చింది.
ఆ వ్యక్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడని కమిటీ రిపోర్ట్ చెప్పింది. వ్యాక్సినేషన్ తర్వాత కలిగే అనఫిలాక్సిస్ వల్ల చనిపోయిన తొలి వ్యక్తిగా కమిటీ తేల్చింది. అనఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన ఎలర్జీ. నిజానికి మరో ముగ్గురు కూడా వ్యాక్సిన్ వల్లే చనిపోయినా.. ప్రభుత్వం మాత్రం ఇదొక్క మరణాన్నే ధృవీకరించింది.
Here's ANI Update
It is the first death linked to COVID vaccination due to anaphylaxis. It re-emphasises the need to wait for 30 minutes after receiving jab. Most of the anaphylactic reactions occur during this period. Timely treatment can prevent deaths: Dr NK Arora, Chairman, COVID working group pic.twitter.com/L9C15KAPTE
— ANI (@ANI) June 15, 2021
వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి రియాక్షన్లు ముందుగా ఊహించినవే అని ప్యానెల్ చెప్పింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వ్యాక్సిన్ తర్వాత అనఫిలాక్సిస్ బారిన పడినా.. వాళ్లు చికిత్స తర్వాత కోలుకున్నారు.
కాగా దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. టీకా తీసుకున్న తరువాత కొద్దిమందిలో దుష్ప్రభావాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పొందాక ఒకటి రెండు రోజుల పాటు కనిపించే అనారోగ్య లక్షణాలను చూసి పెద్దగా భయపడవద్దని.. అవి రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలం కావడానికి సంబంధించిన సంకేతాలని మామూలేనని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఒకటి రెండు రోజులు పాటు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.