AP Covid Report: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 175 మందికి కరోనా పాజిటివ్, ఇద్దరు మృతితో 7,182కి చేరుకున్న మరణాల సంఖ్య, 8,91,563కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

గడచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 మందికి కరోనా పాజిటివ్ (AP Corona Cases) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, Mar 13: ఏపీలో మరోసారి 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 మందికి కరోనా పాజిటివ్ (AP Corona Cases) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 132 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకోగా, అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,563కి చేరుకోగా... 8,83,113 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,268 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,182కి (Covid deaths) పెరిగింది.

ఇక దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. దాదాపు 80 రోజుల తర్వాత రోజు వారీ కేసులు 25 వేలకు చేరువయ్యాయి. గడచిన 24 గంటల్లో 8.40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24,882 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే.. గతేడాది డిసెంబర్ 26న 26,624 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.

దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,73,260 మంది కోలుకున్నారు. 2,02,022 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,58,39,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,40,635 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.