AP Corona Report: ఏపీలో 2341 యాక్టివ్ కేసులు, మొత్తం 5280కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, గత 24 గంటల్లో 193 కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో 15,911 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 193 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా చిత్తూరు, ప్రకాశం నుంచి రెండు మరణాలు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య 88కి చేరింది. కాగా ఇవాళ కొత్తగా 81 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు వైరస్ నుంచి 2851 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2341 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Amaravati, June 16: ఏపీలో కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు (AP Corona Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ (AP Health department) విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5280కి చేరింది. గడిచిన 24 గంటల్లో 15,911 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 193 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాని కట్టడి చేయడం ఎలా ? రాష్ట్రాల సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో 3 లక్షల 50 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు
తాజాగా చిత్తూరు, ప్రకాశం నుంచి రెండు మరణాలు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య 88కి చేరింది. కాగా ఇవాళ కొత్తగా 81 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు వైరస్ నుంచి 2851 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2341 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశ ప్రజలను కరోనా వైరస్ (Coronavirus in India) గజగజ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,43,091 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,53,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,80,013 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో 9,900 మంది కరోనాతో (Coronavirus Deaths) చనిపోయారు.