Farmers Foot March: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నాం.. ప్రెస్ మీట్ లో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. రైతుల పాదయాత్ర సవ్యంగా సాగుతోందన్న డీజీపీ.. రైతుల పాదయాత్రకు అదనపు బందోబస్తు కల్పించామని వివరణ
రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు.
Amaravati, October 15: కావాలంటే నిరసన (Protest) చేసుకోవచ్చు కానీ అమరావతి (Amaravati) రైతుల పాదయాత్రను (Farmers Foot March) మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ (DGP) కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారిని ముందుగానే పిలిపించి యాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నామని, కావాలంటే నిరసన తెలుపుకోవచ్చని చెప్పామని, అందుకు వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు.
మునుగోడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా
ఇప్పటి వరకు అయితే ఎక్కడా తీవ్ర సమస్యలు ఎదురుకాలేదని అన్నారు. ఎక్కడైనా అలా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.