Hyderabad, October 15: మునుగోడు (Munugodu) ఎన్నికల (Elections) సమయంలో అధికార టీఆర్ఎస్ కు అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ (Boora Narsaiah Goud) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బూర నర్సయ్యగౌడ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈనేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.
కాగా బూర నర్సయ్యగౌడ్ ను ఉద్దేశిస్తూ.. ఇటీవలే బీజేపీలో చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో బూర నర్సయ్య గౌడ్ గుణగణాలను కీర్తిస్తూ విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.