Polavaram Project Update: పోలవరంపై కేంద్రమంత్రితో ఏపీ ఆర్థిక మంత్రి భేటీ, పోలవరం నిధులు విడుదల చేయాలని జల శక్తి శాఖ మంత్రి షెకావత్‌ని కోరిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
పోలవరం ప్రాజెక్ట్‌కు(Polavaram Project) సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు (Polavaram Project Funds) త్వరితగతిన విడుదల చేయాలని కోరాను.
Amaravati, July 10: పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో (Gajendra Singh Shekhawat) ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు(Polavaram Project) సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు (Polavaram Project Funds) త్వరితగతిన విడుదల చేయాలని కోరాను. ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా, తాజాగా 1608 కోవిడ్-19 కేసులు నమోదు, సచివాలయానికి మరోసారి కరోనా సెగ, కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య
నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. రీయింబర్స్‌మెంట్ కోసం రివాల్వింగ్ ఫండ్ నుంచి నిధులు విడుదలయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. నాబార్డు ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నప్పటికీ, ఆ నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
Here's Buggana Delhi tour Photos
ఇదిలా ఉంటే ఆయకట్టు రైతులకు చేకూరే ప్రయోజనాలకు ధీటుగా, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరిలో వరద ప్రవాహం పెరిగేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస పనులను శరవేగంగా చేసేందుకు రూ.3,383.31 కోట్లు ఖర్చు చేస్తోంది. 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని మిగిలిన 84,731 నిర్వాసిత కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. మొత్తమ్మీద నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికి రూ.24,249.14 కోట్లను వ్యయం చేయనుంది.
పోలవరం నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురికావటంతో పాటు 1,05,601 కుటుంబాలు నిర్వాసితులుగా మారతారు. వారికి ‘భూసేకరణ చట్టం–2013’ ప్రకారం పునరావాసం కల్పించాలి. ఏపీ సీఎం వైయస్ జగన్ పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిర్వాసితుల పునరావాసం, స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లబ్ధి పొందే రైతుల కంటే మిన్నగా నిర్వాసితుల జీవన ప్రమాణాలుండేలా పునరావాసం కల్పించాలని ఆదేశించారు.
పునరావాస కల్పనకు చర్యలు
రిజనులకు రూ.3.59 లక్షలు. గిరిజనేతరులకు రూ.3.34 లక్షలతో 379.25 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా పక్కా ఇళ్లను కట్టి నిర్వాసితులకు ఇవ్వాలని ఆదేశించారు. పునరావాస కాలనీలకు విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలన్నీ కల్పించాలన్నారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం కూడా నిర్మించాలని ఆదేశించారు. మిగిలిన కుటుంబాలకు దశలవారీగా వేగంగా పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ పనుల పర్యవేక్షణకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌గా ఐఏఎస్ అధికారి ఓ.ఆనంద్‌ను నియమించారు.
త్వరితగతిన భూసేకరణ
41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపునకు గురయ్యే 69,686 ఎకరాలకుగానూ 68,087.88 ఎకరాలను సేకరించారు. మరో 1600.50 ఎకరాలను సేకరణకు కసరత్తు చేస్తున్నారు. సేకరించిన భూమికి రూ.3,304.6 కోట్లను పరిహారంగా చెల్లించారు. మిగిలిన భూసేకరణకు రూ.273.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 98 గ్రామాల్లోని 17,760 కుటుంబాల ప్రజలకు ఉభయ గోదావరి జిల్లాల్లో 47 పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. పునరావాసం కల్పించే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.6.36 లక్షలను పరిహారం ఇవ్వనున్నారు. గిరిజన కుటుంబాలకు మరో రూ.50 వేలను జత చేసి రూ.6.86 లక్షలను అందజేయనున్నారు. నిర్వాసితులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు.
ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం
ఈ నెల 15న వెలగపూడిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం. ఇక గత నెల 11న జరిగిన భేటీలో వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.