AP Global Investment Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో నేడు రూ. 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు.. వెరసి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడుల విలువ రూ. 13 లక్షల కోట్లు.. యువతకు రానున్న ఉద్యోగాలు 6 లక్షలు
విశాఖ తీరంలో నిన్నమొదలై నేడు కూడా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
Visakhapatnam, March 4: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) పెట్టుబడులకు (Investors) స్వర్గధామంగా మారుతున్నధి. విశాఖ (Visakhapatnam) తీరంలో నిన్నమొదలై నేడు కూడా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investment Summit) ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు.
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలు హాజరైన ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
శనివారం రెండో రోజు కూడా సదస్సు కొనసాగనున్నధి. రెండోరోజు 248 ఎంవోయూలను కుదుర్చుకోనున్నారు. వీటి విలువ రూ.1.15 లక్షల కోట్లు. ఈ ఒప్పందాల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. రిలయెన్స్ గ్రూప్, అదాని గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలెజ్, పార్లే, శ్రీ సిమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారాన్ని విస్తరించనున్నాయి.