Andhra Pradesh: ఇకపై ఏపీ ఉత్తర్వులన్నీ ఈ–గెజిట్​ లోనే, అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని స్పష్టం

ఇకపై అన్ని ఉత్తర్వులను ఈ–గెజిట్ ద్వారా జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఏపీ ఈ గెజిట్’లోనే (E gazette) ప్రజలకు అవి అందుబాటులో ఉంటాయన్నారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, Sep 8: ఇకపై అన్ని ఉత్తర్వులను ఈ–గెజిట్ ద్వారా జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఏపీ ఈ గెజిట్’లోనే (E gazette) ప్రజలకు అవి అందుబాటులో ఉంటాయన్నారు. సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని స్పష్టం చేసింది.

జీవో ఐఆర్ వెబ్ సైట్ ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకుగానూ వివరాలను ఈ–గెజిట్ లో పొందుపరచనున్నట్టు చెప్పారు. అయితే, కొన్ని ఉత్తర్వులు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండవన్నారు. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ ఖర్చులు, అధికారుల సెలవులు, రహస్య సమాచారాన్ని మాత్రం అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేశారు. అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో ఈ గెజిట్ లో ఉత్తర్వులు అందుబాటులో ఉంటాయన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement