Vidya Varadhi Mobile Vehicles: ఏపీలో సరికొత్త పథకం, విద్యా వారధి మొబైల్‌ వాహనాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి జిల్లాలోని విద్యార్థులకు వీటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

విద్యా వారధి మొబైల్‌ వాహనాలను మంత్రి సురేష్‌ (Education Minister Adimulapu Suresh) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

AP government launches Vidya Varadhi Mobile Vehicles (Photo-Twitter)

Amaravati, July 31: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారధి మొబైల్‌ వాహనాలు (Vidya Varadhi Mobile Vehicles) అందుబాలోకి తీసుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. విద్యా వారధి మొబైల్‌ వాహనాలను మంత్రి సురేష్‌ (Education Minister Adimulapu Suresh) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్లాస్మా ఇస్తే రూ.5వేల ప్రోత్సాహక నగదు, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ సీఎం వైయస్ జగన్‌, ప్రతి ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్టులో బెడ్ల వివరాలు ఉండాలని ఆదేశాలు

లక్షపద్దెనిమిది వేల విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అనుభవం లేదని, విద్యా వారధి మొబైల్ వ్యాన్ 13 జిల్లాలకు వెళ్లి విద్యార్థులకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తుందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. విద్యా క్యాలండర్‌న ఇప్పటికే కరోనా చిన్నాభిన్నం చేసిందని, సెప్టెంబర్ 5 తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif