Amaravati, July 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే వారికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు (Five Thousand for Plasma Donors) అందజేస్తామని ప్రకటించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (CM Office) కరోనా వైరస్ నిర్మూలన, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడుపై (AP CM YS Jagan review meeting) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ప్లాస్మా థెరపీపై అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది’ అని సీఎం జగన్ తెలిపారు.
కరోనా చికిత్స (Coronavirus Treatment) కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశంలో సూచించారు. అలాగే సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్ బోర్డు పెట్టి.. అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్ అలాట్ చేయాలని తెలిపారు. కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి, విషాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
జీజీహెచ్ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలి. జేసీలు దీనిపై ఫోకస్ పెట్టాలి. ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌పై బాగా దృష్టి పెట్టండి. కాల్‌సెంటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా.. చూడండి. వచ్చే కొన్ని రోజులు దీనిపై శ్రద్ధ వహించండి. కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టండి. స్వప్రయోజనాలకోసం తప్పుడు వార్తాకథనాలు ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలి. లేదంటే ప్రజలు వీటిని వాస్తవం అనుకునే అవకాశం ఉంది. నిజాలు ప్రజలముందు పెట్టండి. వచ్చే సమాచారంలో వాస్తవాలు ఉంటే.. వాటిని పాజిటివ్‌గా తీసుకుని సమస్యలను పరిష్కరించండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి. దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండి. వీటిని ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కల్పించాలి. కోవిడ్ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే... ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమాలనూ సమీక్షించాలి. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావాలి’ అని సీఎం జగన్ ఆదేశించారు.