Kurichedu Sanitizer Deaths: కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి, విషాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌
Kurichedu Deaths Incident (Photo-Twitter)

Amaravati, July 31: ప్రకాశం జిల్లా కురిచేడులో తీవ్ర విషాద ఘటన (Kurichedu Incident) చోటు చేసుకుంది. కురిచేడులో మందు దొరక్క  శానిటైజర్‌ (Sanitizer)తాగిన ఘటనలో పది మంది మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో ఏడు మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మరో ఆరుగురు గ్రామస్తులు ఉన్నారు. చనిపోయిన వారిని అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు (40), ఛార్లెస్‌ (45), అగస్టీన్‌ (47) గా గుర్తించారు. మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియానికే కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ,యూకేజీ విద్య అమలు, మీడియాతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

కరోనావైరస్ దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు లేకపోవటంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్‌ తాగారు. మద్యం దొరకక కొంతకాలంగా వీరు శానిటైజర్ తాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కురిచేడులో శానిటైజర్‌ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులో​కి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్‌ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Here's Video

Here's Darsi MLA Tweet

ఈ విషాదకర ఘటనపై (Kurichedu Incident) స్పందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ (SP Siddharth Kaushal) కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైన మృతులు మందు దొరకకపోవడంతో శానిటైజర్లు తాగారని, సీనియర్‌ అధికారులతో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 70 వేలకు పైగానే టెస్టుల నిర్వహణ

కురిచేడు ఘటనపై ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి స్పందించారు. ఆల్కహాల్‌ తీసుకోవడంతో అది మనిషి రోగ నిరోధక శక్తిపై గణనీయమైన ప్రభావం చూపే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. మద్యం, మత్తు పదార్ధాలు వ్యసనంగా మారి వత్తిడికి గురవడంతోనే పేదలు వివిధ ప్రత్యామ్నాలకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం బాధాకరమన్నారు.

Here's Video

అలాంటి వ్యసనపరులను మద్యం, మత్తుల నుంచి విముక్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం డి- అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15చోట్ల ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రులలో డి- అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. మరో 10 చోట్ల సైతం ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని తెలియజేశారు

కురిచేడులో 10 మంది మృతి పట్ల చంద్రబాబు (Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో మద్యం ధరలు 300%పైగా పెంచేశారు. నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని మండి పడ్డారు.

ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో శానిటైజర్ తాగి చనిపోయిన దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరపాలని కోరారు. ఇంకా మృత్యువుతో పోరాడుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విన్నవించారు. మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు

ప్రకాశం జిల్లా కురిచేడులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (APPCC chief Sailajanath)  అన్నారు. ప్రభుత్వ మద్యపాన విధానం విఫలమైందనటానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక ప్రకాశం జిల్లా కురిచేడులో నాటుసారా మరణాల ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కురిచేడు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషీయా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.