AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravati, July 31: ఇప్పటికీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Education Minister Adimulapu Suresh) స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై (National Education Policy (NEP) ఆయన స్పందించారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకొనే తాము విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం (English Medium) కావాలన్నాన్నారు.

జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (CM Y.S. Jagan Mohan Reddy) అమలు చేస్తున్నవే ఉన్నాయ‌ని సురేష్ అన్నారు. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లు, భావ‌జాలం, సంస్క‌ర‌ణ‌లు ఈ విధానంలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోర‌ణిలో చూసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తే, సీఎం జ‌గ‌న్ మాత్రం విద్యను పేదలకు హక్కుగా అందించాలని ఆకాంక్షించారని తెలిపారు. ఆ ఆలోచనే నేడు కేంద్ర విద్యా విధానంలో ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు

ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్రామం నుంచి కూడా ఇంగ్లీషు మీడియం కావాలని తీర్మానం చేశారన్నారు. ‘జాతీయ విద్యా విధానం ప్రకారం తెలుగు భాష ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా రావాల్సి ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించరాదు. నూతన పాలసీని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించాలనుకుంటే ఎలా?’ అని ప్రశ్నించారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, అందుకే ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

ఇంగ్లిష్‌ మీడియంపై కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. అవకాశం ఉన్నంత వరకు మాతృ భాషను అమలు చెయ్యమని చెప్పింది. అంతే కాదు 2 నుంచి 8 మధ్య వయస్సున్న‌ పిల్లలు భాషలు త్వరగా నేర్చుకోగలరని, భాషలు నేర్చుకోవాలంటే మీడియం ఒక్కటే కారణం కాదని తెలిపింది. మేం ఇంగ్లిష్‌ మీడియంకు కట్టుబడి ఉన్నాం. తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యలేదు. ప్రతి ఒక్కరు మా గ్రామానికి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. పూర్తిగా తెలుగుమీడియం ఉండాలంటే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోను అమలు చేయాల్సి ఉంటుంది" అని ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం

డిగ్రీ కోర్సుల్లో సీబీసీఎస్‌ కింద ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌కు సీఎం ఇప్పటికే ఆదేశించగా కేంద్రం ఈ విషయాన్ని కూడా తమ పాలసీలో పెట్టింది. నాలుగేళ్ల డిగ్రీ పాలసీ రావాలని, కోర్సులను ఫ్లెక్సిబిలిటీ ఉండేలా సీఎం ముందుగానే సూచించారు. మేం ఇచ్చిన సూచనలు, సలహాలు నూతన విద్యా విధానంలో పొందుపరిచారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని, ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీ్‌సను మేం సూచించగా పాలసీలో పొందుపరిచారని చెప్పారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ విద్యావిధానంలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్‌ రూపొందించాలని సూచించారు.