Coronavirus Outbreak in India (Photo Credits: IANS)

Amaravati, July 30: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. వరుసగా రెండో రోజూ ఏపీలో 10 వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో  రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,30,557 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 1,27,662 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి నుంచి అత్యధికంగా 1441 కేసులు, కర్నూలు నుంచి 1252 కేసులు, విశాఖపట్నం నుంచి 1223, పశ్చిమ గోదావరి నుంచి 998 మరియు గుంటూరు నుంచి 946 కేసుల చొప్పున నమోదయ్యాయి.

గడిచిన ఒక్కరోజులో మరో 68 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1281 కు పెరిగింది.

AP's COVID19 Report: 

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 4,618 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 60,024 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 69,252 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  కరోనా కేసుల్లో భారీ ఊరట, భారీగా పెరుగుతున్న రికవరీలు, దేశంలో ఇప్పటికే 10 లక్షల మంది పైగా డిశ్చార్జ్

గడిచిన ఒక్కరోజులో భారీ స్థాయిలో 70,068 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు 18,90,077 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.