Andhra Pradesh: హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం, నిర్మాణ పనులను దక్కించుకున్న ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ

కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు (AP Government sanctioned Rs.24 crore) చేసింది.దీనికి సంబంధించిన నిర్మాణ పనులను (construction of causeway on Handri River ) ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది.

YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Jan 23: కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు (AP Government sanctioned Rs.24 crore) చేసింది.దీనికి సంబంధించిన నిర్మాణ పనులను (construction of causeway on Handri River ) ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలోపు ఈ పనులు పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాజ్‌వే నిర్మాణ పనులను ఈనెల 24న ప్రారంభించనున్నారు.

ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్ప పాదయాత్ర ని చేపట్టిన జగన్.. కృష్ణగిరి మండలంలోని ఎస్‌హెచ్‌ ఎర్రగుడి నుంచి హంద్రీనది మీదుగా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి 2017 నవంబర్‌ 27వ తేదీన నడుచుకుంటూ వచ్చారు.దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు హంద్రీనదిపై కాజ్‌వే నిర్మించాలని కోరారు. మన ప్రభుత్వం వస్తే కాజ్‌వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అప్పట్లో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు నిధులను మంజూరు చేశారు.

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు, సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశాలు

గోరంట్ల నుంచి కొత్తపల్లె, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాలకు రెండు కిలోమీటర్లు దూరం ఉంది. హంద్రీ నదికి వరద వస్తే 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయా గ్రామాలకు చేరుకోవలసిన దుస్థితి ఉండేది. ఈ నిర్మాణం ద్వారా ఆ ప్రాంత వాసుల కష్టాలు తీరనున్నాయి. కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని కొత్తపల్లె, రామకృష్ణాపురం, ఎస్‌హెచ్‌ ఎర్రగుడి, ఎర్రబాడు, చుంచు ఎర్రగుడి, మన్నేగుంట, కృష్ణగిరి, బాపనదొడ్డి, కంబాలపాడు, జి.మల్లాపురం, ఆగవెలి, పి.కోటకొండ గ్రామాల ప్రజలకు ఈ కాజ్ వే నిర్మాణం ద్వారా ప్రయాణం మరింత సులువు కానుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now