IAS Transfers in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమకాలు అందించారు.
Vijayawada, June 23: 18 మంది ఐఏఎస్ (IAS) లను బదిలీ చేస్తూ ఏపీ సర్కారు (AP Government) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమకాలు అందించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిలకు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరోవైపు షగిలి షన్మోహన్ కు కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇఛ్చారు. బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం కలెక్టర్ దినేశ్ కుమార్‌కు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగు ఇచ్చారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించడం విశేషం.
తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
కలెక్టర్ల బదిలీలు ఇలా..
షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా...ఈ కూరగాయలతో డయాబెటిస్ కంట్రోల్ వుంటుంది...