AP Panchayat Offices Colour Issue: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో (AP Panchayat Offices Colour Issue) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని ఆదేశించింది.. రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసింది వైఎస్సార్‌సీపీ జెండా రంగులు కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది.. కోర్టు మాత్రం తోసిపుచ్చింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
Amaravati, June 3: ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో (AP Panchayat Offices Colour Issue) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని ఆదేశించింది.. రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.మరో రికార్డు దిశగా ఏపీ, 4 లక్షల కోవిడ్-19 టెస్టులు చేసిన రాష్ట్రంగా గుర్తింపు, కరోనా నియంత్రణ కోసం రూ.300 కోట్లకు పైగా వ్యయం, ఏపీలో 3279కి చేరిన కేసుల సంఖ్య
ప్రభుత్వ కార్యాలయాలకు వేసింది వైఎస్సార్‌సీపీ జెండా రంగులు కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది.. కోర్టు మాత్రం తోసిపుచ్చింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పెను తుఫాన్ భయం, వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు, వందేండ్ల తర్వాత తొలిసారిగా ముంబైపై విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్
ప్రభుత్వ కార్యాలయాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. మే 22న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఎస్.ఎల్.పి దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో గ్రామ పంచాయితీ కార్యాలయాల రంగుల వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది. జస్టిస్ లావు నాగేశ్వర్‌రావుతో కూడిన ధర్మసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది.