YSR Zero Interest Loan Scheme 2021: రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ.128.47 కోట్లు జమ,ఈ ఏడాది 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ వర్తింపు, ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ఏపీ ప్రభుత్వం

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం (YSR Zero Interest Loan Scheme) కింద లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది.

AP CM YS Jagan Speech Highlights On BC Sankranthi Sabha At Vijayawada(Photo-Twitter)

Amravati, April 20: రైతు సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్న జగన్ సర్కారు తాజాగా వారికి మరో శుభవార్తను అందించింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం (YSR Zero Interest Loan Scheme) కింద లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది.

ఇప్పుడు రెండో ఏడాది (YSR Zero Interest Loan Scheme 2021) కూడా.. అంటే 2019–20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.

జగనన్న విద్యాదీవెన, 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదు విడుదల, రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి..

ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది.

1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు, షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు, మే 5 నుంచి 23 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం జగన్

గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది.