APTIDCO Row: ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊరట, టిడ్కో ఇళ్ల లబ్దిదారుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Dec 29: ఏపీ విశాఖ జిల్లా అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో (Andhra Pradesh Township and Infrastructure Development Corporation) ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టిడ్కో (APTIDCO) ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించారని, పాత జాబితా ప్రకారమే కేటాయింపులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఇళ్ల కేటాయింపులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనకాపల్లికి చెందిన దొడ్డి వీఎస్‌ జగదీశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడంపై ధర్మాసనం విచారణ జరిపింది.

జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ, ఏపీలో పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది సుమన్‌ హైకోర్టుకు వాదనలు వినిపించారు. 904 మందిని తొలగించడానికి గల కారణాలను కోర్టుకు తెలిపారు. గతంలో పలువురు ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు పొందారని, మరికొందరు అసలు టిడ్కో ఇళ్లు పొందేందుకు ఏ మాత్రం అర్హులు కారని, ఇలా పలు కారణాలతో తొలగించారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.

ఏపీలో కొత్త కరోనావైరస్ అలజడి, యూకే నుంచి వచ్చిన 11 మందికి కోవిడ్ పాజిటివ్, 1363కు చేరిన యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారి సంఖ్య

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరగనున్న టిడ్కో రిజిస్ట్రేషన్ల విషయంలో పక్కాగా వ్యవహరించాలని మున్సిపల్‌ కమిషనర్లను పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఆదేశించారు.