AP High Court: కోర్టుకు వచ్చే ముందు ప్రభుత్వానికి వినతి పత్రం తప్పనిసరి, సంబంధిత అధికారులను ఆశ్రయించకుండా డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌ కోసం వేసే పిటిషన్లను విచారించబోమని తెలిపిన ఏపీ హైకోర్టు

ఫలానా వ్యవహారంపై ‘నిర్దిష్టమైన ఆదేశం’(మాండమస్‌) ఇవ్వాలని అభ్యర్థిస్తూ కోర్టుకి వచ్చే ముందు.. పిటిషనర్‌ ఆ అంశంపై అధికారులకు తప్పనిసరిగా వినతిప త్రం సమర్పించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, Sep 20: ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేయాలనుకుంటే సంబంధిత అధికారులకు (authorities) వినతిపత్రం ఇచ్చి వారి అభిప్రాయం పరిగణలోకి తీసుకున్న తరువాతనే హైకోర్టు (AP High Court) గడప తొక్కాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫలానా వ్యవహారంపై ‘నిర్దిష్టమైన ఆదేశం’(మాండమస్‌) ఇవ్వాలని అభ్యర్థిస్తూ కోర్టుకి వచ్చే ముందు.. పిటిషనర్‌ ఆ అంశంపై అధికారులకు తప్పనిసరిగా వినతిప త్రం సమర్పించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా, ప్రభుత్వానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తుండటంతో హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి ఫలానా అంశంపై నిర్ధిష్టమైన ఆదేశం (మాండమస్‌) ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ముందు పిటిషనర్‌ ఆ అంశంపై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి ‘న్యాయాన్ని డిమాండ్‌’ (డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌) (Demand of Justice) చేయడం తప్పనిసరని హైకోర్టు పేర్కొంది అలా న్యాయాన్ని డిమాండ్‌ చేయకుండా నేరుగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) అయినప్పటికీ దానిని విచారించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

విశాఖలో టీడీపీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, విశాఖను ఆర్థిక రాజధానిగా స్వాగతిస్తున్నామని తెలిపిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే

న్యాయాన్ని డిమాండ్‌ చేయకుండా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు మళ్లించిందని.. దీనిపై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ బట్టు దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ బట్టు దేవానంద్‌తో కూడిన ధ ర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని, దీనిపై విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ పశ్చిమగోదావరికి చెందిన జి.శరత్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. గత ఏడాది జూన్‌లో హైకోర్టులో ఆయన పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారించింది.దానిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. తగిన వివరాలు లేవంటూ పిల్‌ను తిరస్కరించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif