AP Local Body Polls: అక్కడ ఏకగ్రీవాలను ఆపండి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రకటించవద్దని తెలిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, మండిపడుతున్న అధికార పక్షం నేతలు, తొలి విడతలో 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం, ఈసీ ఈ–వాచ్‌ యాప్‌పై 9వ తేదీ వరకు ఏపీ హైకోర్టు స్టే

ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.

Nimmagadda Ramesh kumar vs AP CM YS Jagan (Photo-File Image)

Amaravati, Feb 6: ఏపీలో తొలి విడత పంచాయితీ ఎన్నికలకు పోలింగ్ ఈ నెల 9న ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు జిల్లాల కలెక్టర్లు పంపే వివరణాత్మక నివేదికలను పరిశీలించిన తర్వాత ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రకటించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నారు.

దీనిపై అధికార పక్షం మండి పడుతోంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్‌ వివరణ కోరడం తొందరపాటు చర్య అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్తేమీకాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తొలినుంచి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు (Andhra Pradesh panchayat elections) ఉంటున్నాయని తెలిపారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తప్పుబట్టారు. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని రద్దుచేసి సరిపెట్టడమేంటని ప్రశ్నించారు. ఆయనపై చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేత పట్టాభిపై దాడి, అక్కడ అసలేం జరిగింది? కొడాలి నాని హస్తం ఉందంటున్న టీడీపీ నేతలు, తీవ్రంగా ఖండించిన కొడాలి నాని, ఎంతమందిని చంపుతారంటూ చంద్రబాబు ఫైర్, ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

పచ్చచొక్కాలతో కాక్‌టైల్‌ డిన్నర్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండడానికి అర్హులా కాదా అన్న విషయాన్ని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు హితవు పలికారు. ఏకగ్రీవ ఎన్నికలు వద్దనే అధికారం ఆయనకు ఎక్కడిదని వారు ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి గందరగోళపర్చడం, అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు అలవాటైందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, చింతా అనూరాధ, అయోధ్య రామిరెడ్డిలు శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలకు (AP Local Body Polls) సంబంధించి 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. సర్పంచ్‌ పదవుల కోసం 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 18,168 మాత్రం సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్, నేను హోం మంత్రి అయిన తరువాత మీ సంగతి చూస్తా, పోలీసులపై బెదిరింపులకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే, శ్రీనివాస్‌రెడ్డి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని తెలిపిన నిమ్మగడ్డ

తొలి విడతలో (AP panchayat elections 2021) విజయనగరం జిల్లా లేదు. మిగిలిన 12 జిల్లాలను పరిశీలిస్తే.. తొలి విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీలు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 454 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,499 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డులకు ఈ నెల 9న పోలింగ్‌ జరగనుంది

కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక యాప్‌లను కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఈ–వాచ్‌ పేరుతో రూపొందించిన ప్రైవేట్‌ యాప్‌ను ఈ నెల 9వ తేదీ వరకు వినియోగంలోకి తీసుకు రావొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ వాచ్‌ యాప్‌ను ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌ఎల్‌) పరిశీలించవచ్చని స్పష్టం చేసింది. ఈ వాచ్‌ యాప్‌పై నిషేధం విధించి, ‘సీ విజిల్‌’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఇదే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాళెంకు చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.