AP Coronavirus: గుడ్ న్యూస్..ఏపీలో తగ్గుముఖం పడుతున్న కేసులు, తాజాగా 18,972 మందికి కరోనా, 71 మంది కోవిడ్19తో మృతి, ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 11,61,099కు చేరింది. నిన్న 71 మంది కోవిడ్19తో మృతి చెందారు,

Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, May 3: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,15, 275 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 18,972 మందికి పాజిటివ్ గా (AP Coronavirus) నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 11,61,099కు చేరింది. నిన్న 71 మంది కోవిడ్19తో మృతి చెందారు.

దీంతో ఏపిలో కోవిడ్19 మృతుల సంఖ్య 8,207కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10 వేల 227 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని వెల్లడించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,51,852 గా ఉంది. ఇప్పటివరకు 10,01,040 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గత 24 గంటల్లో కరోనా కారణంగా విజయనగరంలో తొమ్మిది మంది, విశాఖపట్టణంలో తొమ్మిది మంది, చిత్తూరులో అయిదుగురు, తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, కర్నూలులో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, నెల్లూరులోఇద్దరు, గుంటూరులో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు.

Here's AP Covid Report

ఏపీలో మే 5 నుంచి డే కర్ప్యూ, రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లోకి, ఉదయం 6 నుంచి 12 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు

కోవిడ్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌ అమలు కానుంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.